![]() |
![]() |

భారతీయ సినిమా గర్వించదగ్గ లెజండ్రీ నటుడు అమీర్ ఖాన్(Aamir Khan).. మొన్న ఐదున ముచ్చటగా మూడోసారి గౌరీ స్ప్రాట్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ముంబై బాంద్రాలోని తన నివాసంలో అత్యంత నిరాడంబరంగా, సన్నిహితులు, ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ వేడుకకి కేవలం 150 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఈ వివాహ వేడుకకు వర్షం కురుస్తున్నప్పటికీ, బాలీవుడ్ ప్రముఖులు, పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ, మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మరియు రాజకీయ నాయకులు హాజరై నూతన వధూవరులని ఆశీర్వదించారు. అయితే, సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పెళ్లి ఫొటోలలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం గౌరీ స్ప్రాట్ ధరించిన ప్రత్యేకమైన నెక్లెస్.
గౌరీ స్ప్రాట్ మెడలో ధరించిన సాంప్రదాయ నెక్లెస్ పేరు "హైదరాబాదీ పఠానీ హార్" నిజాం కాలం నాటి రాజసం, ప్రత్యేకమైన ముత్యాలు, పోల్కీ వజ్రాలతో అద్భుతమైన నైపుణ్యంతో రూపొందించిన ఈ నెక్లెస్ పెళ్లి వేడుకలోనే ప్రత్యేక ఆకర్షణగా మారింది. నార్త్ ఇండియన్ స్టైల్ బ్రైడల్ లుక్‌కి ఈ హైదరాబాదీ రాయల్ జ్యువెలరీ తోడవడంతో గౌరీ స్ప్రాట్ మెరిసిపోయారు. పెళ్లికి వచ్చిన వారితో పాటు సోషల్ మీడియాలో ఈ ఫొటోలు చూసిన వారంతా ఆమె సింప్లిసిటీకి, ఆ పఠానీ హార్ రాయల్ లుక్‌కు ఫిదా అయిపోతున్నారు. 59 ఏళ్ల ఆమిర్ ఖాన్, 47 ఏళ్ల గౌరీ స్ప్రాట్ మధ్య 13 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. వీరిద్దరికీ 25 ఏళ్ల క్రితమే పరిచయం ఉన్నప్పటికీ, 2024 లో బెంగళూరులో ఆమిర్ కజిన్ నుజ్రత్ ఖాన్ ద్వారా వీరి పరిచయం మళ్లీ బలపడింది. ఒక సంవత్సరం పాటు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత, 2025 లో ఆమిర్ తన 60వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా గౌరీని తన లైఫ్ పార్టనర్ గా ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ తర్వాత గౌరీ స్ప్రాట్ బెంగళూరు నుండి ముంబైకి మారి, 25 వసంతాలు పూర్తి చేసుకున్న "ఆమిర్ ఖాన్ ఫిల్మ్స్" ప్రొడక్షన్ హౌస్‌లో కీలక బాధ్యతలు చేపట్టారు.
Also read: shankar: శంకర్ శకం ముగిసిందా?.. ఇకపై ఆ అద్భుతాలు చూడలేమా!
లండన్‌లోని 'యూనివర్శిటీ ఆఫ్ ది ఆర్ట్స్' నుంచి ఫ్యాషన్, స్టైలింగ్, ఫోటోగ్రఫీలో ఎఫ్‌డిఎ (FDA) డిగ్రీ పూర్తి చేసిన గౌరీ స్ప్రాట్, ప్రొఫెషనల్ హెయిర్‌డ్రెస్సర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఈమె తల్లి తమిళురాలు కాగా, తండ్రి ఐరిష్ వ్యక్తి. గౌరీ తాతగారు భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడు కావడం విశేషం. ఆమిర్ గత భార్యలు రీనా దత్తా, కిరణ్ రావుల పిల్లలైన జునైద్ ఖాన్, ఇరా ఖాన్ మరియు ఆజాద్ రావు ఖాన్‌లు కూడా ఈ వివాహ వేడుకలో పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినా ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి ముచ్చట్లతో పాటు, గౌరీ స్ప్రాట్ మెడలోని హైదరాబాదీ పఠానీ హార్ గురించిన చర్చలే నడుస్తున్నాయి.
aamir khan, gauri spratt
![]() |
![]() |